Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పొన్కల్ లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 21 Nov 2026, 01:35 PM | 7 | నిర్మల్, తెలంగాణ
పొన్కల్ లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
మామడ మండలం పొనకల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మత్స్యకారుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షులు పొట్టేల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనాధారమైన చెరువుల పరిరక్షణతో పాటు గంగపుత్రుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రవి, క్యాషియర్ రమేశ్‌తో పాటు పలువురు గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: