సింగర్ నర్సిరెడ్డి క్షమాపణలు
--------------------------
సింగర్ నల్గొండ నర్సిరెడ్డి కమ్యూనిస్టులపై గతంలో చేసిన వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్న వివాదంపై ఆయన ఫేస్బుక్ వేధికగా స్పందించాడు. నర్సిరెడ్డి రాసిన పోస్టు ఈ కింది విధంగా ఉంది.
"అందరికీ నమస్తే నేను మీ నర్సన్న
నేను కష్టాన్ని నమ్ముకుని
పాటను పట్టుకొని పైకి వచ్చినవాడిని
హోటల్లో పని చేసి కారు డ్రైవర్ గా ఉండి
శ్రామిక వర్గాల నుండి వచ్చిన్నవాడిని
చిన్నప్పటి నుండి
నాకు తెలిసిన పాట విప్లవమే
గద్దరన్న గోరేటి వెంకన్న అన్న
విమలక్క పాటలతో పాట నేర్చుకున్నా
జనమే నా పాటను ఎత్తుకుంటే ఇక్కడిదాకా వచ్చినవాడిని
ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే
ఆయన దగ్గర పని చేస్తూ
ఆయనకు ప్రత్యర్ధిగా వున్న
లోకల్ పరిస్థితుల మీద ఏదో ఆవేశంలో
అప్పటి రచయితలు ఎవరో కలిపిన పదాలతో పాడిన అదే నేను వాళ్ల కోసం
ఎంత కష్టపడ్డాను అనేది అర్ధం కావాలి అనే భావనతో ఆరేడేళ్ల క్రితం
ఒక ఇంటర్వ్యూలో పాడాను
నేనే మర్చిపోయిన ఆ చిన్న క్లిప్ ను
బయటకు తీసి
ఇంత చేస్తారు అని ఊహించలేదు
దానివల్ల నా కమ్యూనిస్ట్ సోదరులు
ఇంత బాధపడడం నన్ను చాలా కలచివేసింది
ఇది ఉద్దేశ్య పూర్వకంగా అన్నది కాదు
పొరపాటున జరిగింది
దీనివల్ల బాధపడిన
ప్రతి కమ్యూనిస్టు సోదరుడికి
ప్రతి కళా హృదయానికి
మనస్పూర్తిగా క్షమాపణ కోరుకుంటున్న
ఇక నుండి సమాజం హితం కోరే సామాజిక గీతాలు కుడా నా నుండి ఎక్కువగా మీరు వింటారని మాటిస్తూ
ఎప్పటిలానే నన్ను నా పాటను ఆదరిస్తారని నమ్ముతూ...
మీ నర్సన్న"



