Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ.

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 03:42 PM | 17 | Politics, తెలంగాణ
నూతన గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ.
 కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవదారికుంట తాండ నూతన గ్రామపంచాయతీ కి రూ. 20 లక్షల వీబీజీ రామ్ జీ నిధులతో నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనానికి శనివారం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మూణావత్ మంగమ్మ రతన్ సింగ్, పిఆర్ ఏఈ మహేష్ , గ్రామ కార్యదర్శి చందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులు పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. 
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు వి.బాల్ రాం, మత్రు, లక్ష్మీ దస్రు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాత్లావత్ కృష్ణ, ఉప్పునుంతల మండల మేస్త్రి సంఘం అధ్యక్షుడు మూన్య, గ్రామ పెద్దలు, నాయకులు రతన్ సింగ్, దూద్య నాయక్, గోపాల్, మధు, రమేష్, వంశీ,అఖిల్, ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: