Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహా పాదయాత్ర సన్నాహక సమావేశం మల్యాల

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 08:37 PM | 4 | Politics, తెలంగాణ
మహా పాదయాత్ర సన్నాహక సమావేశం మల్యాల
 మల్యాల మండలం 21 : ప్రతినిధి బి. రఘు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్ర కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది.ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారు విచ్చేస్తున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మల్యాల మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మహా పాదయాత్ర సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి మండల అధ్యక్షులు శ్రీ గాజుల మల్లేశం గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి గారు విచ్చేసి కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహా పాదయాత్రను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చేలా ముందు నుంచే సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టి, ప్రజల్లో పార్టీ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఈ పాదయాత్రలో క్రియాశీలకంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మల్యాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: