Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన బీసీ మహిళ జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత

Author
Posted By TELANGANA KERATAM
| 22 Nov 2026, 06:19 PM | 6 | Politics, తెలంగాణ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన బీసీ మహిళ జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన బీసీ మహిళ జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత

.తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 22:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజా లలిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల అవుతున్న కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోకి జి. ఆర్ కాలనీలోకి వచ్చి వరదల ప్రాంతంలో కొట్టుకపోయినటువంటి డివైడర్స్ చూడడం జరిగిందని, సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు తట్టడే మొరంబోసిన పాపాన లేరని, రాత్రి సమయంలో కామారెడ్డి చీకటిమంగా మారుతుందని దానిని అధువుగా చేసుకొని దొంగలు బీభత్సంగా వస్తున్నారని, డివైడర్ పైన లైట్స్ పెట్టాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా మున్సిపల్ పరిధిలోని 49 వార్డులలో ఎక్కడికి అక్కడే చెత్తాచెదారం మురికి కాలువలు ఏరకపోతున్నాయని, మున్సిపల్ వార్డులలో మున్సిపల్ కార్మికులు  కూడా లేక చెత్తాచెదారం పేరకపోతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి లోనే నామినేషన్ వేసి ఓడిపోయామని భయంతో కామారెడ్డి మున్సిపల్ కు నిధులు ఇవ్వడం లేదని నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నాను అన్నారు, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి నీవు కూడా మహిళ ఆడపడుచువే  మహిళలకు ఆడబిడ్డలకు మనకు ముఖ్యంగా అందరికీ ఒకే పండుగ అది మీకు తెలుసు బతకమ్మ పండగకు అన్ని ఏర్పాట్లు చేశామని  చెప్పడం తప్ప సద్దుల బతుకమ్మ రోజు చీకట్లో బతుకమ్మలు వేయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నీవు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక అభివృద్ధి పని చేసిన దాకాలు లేవని, కామారెడ్డి మున్సిపల్లో ఎవరు అవినీతికి పాల్పడిన వారి భరతం పడతానని ఎమ్మెల్యే కాకముందు చెప్పావని గెలిచి మూడు సంవత్సరాలు ఆవుతున్న మున్సిపల్ లో  ఇంత అవినీతి జరుగుతున్న మీరు ఎందుకు బయట పెట్టడం లేదని దీనిపైన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎట్టి పరిస్థితులలో మున్సిపల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకొని వారిని మీడియో ముందుకు చూపించాలని సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నారు. మీ సొంత మేనిఫెస్టో  150 కోట్లతో ప్రతి మండలంలో హాస్పిటల్ స్కూల్స్ నిర్మిస్తానని చెప్పి మూడు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు దాని ఊసే లేదని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రభుత్వ సలహాదారు  బిజెపి స్థానిక ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణ రెడ్డి   కామారెడ్డి మున్సిపల్ పరిధిలో చెత్తాచెదరంతో రాత్రి సమయంలో వీధిలైట్లు లేక చాలామంది భయభ్రాంతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే మా బీసీ సంఘం తరఫున మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: