Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం -70 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

Author
Posted By Kancharala Shivakumar
| 22 Nov 2026, 07:32 PM | 10 | తెలంగాణ
చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం -70 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

దుబ్బాక ప్రతినిధి,తొగుట, నవంబర్ 22:(తెలంగాణ కెరటం )

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తొగుట మండలం చిన్న ముత్యంపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 70 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్"అరవింద్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా వరుసగా ముత్యంపేట గ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్, జిల్లా కన్వీనర్ మాలే రమేష్, సంచార జాతుల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు కాలియా యాదగిరి, చిన్న అంబయ్య, గోపాల్, చంద్రయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: