Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బుజరంపేటలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 07:26 AM | 5 | NATIONAL, Politics, తెలంగాణ
బుజరంపేటలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రారంభం
అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలి
కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 22
 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో కృష్ణ, ఏపీవో పుణ్యదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు సమయంలో అవసరమైన వివరాలను అధికారులకు అందించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: