Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 07:29 AM | 4 | Politics, తెలంగాణ
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
 బెల్లంపల్లి ప్రతినిధి నవంబర్ 22 తెలంగాణ కెరటం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి కార్మికుడి కుటుంబానికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు కోటి రూపాయల బీమా చెక్కును శనివారం నాడు అందజేసింది. గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు. స్థానిక హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం ఖాతా ఉండడం వల్ల అతని నామినిగా ఉన్న భార్య సుమలతకు కోటి రూపాయల బీమా చెక్కును బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్, సీనియర్ మేనేజర్ తరుణ్ సింగ్, బ్యాంకు ఆర్డీవో విజయ్ సంజయ్ చేతుల మీదుగా ఈ బీమా డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు లో ఖాతా కలిగిన ప్రతి ఒక్క బ్యాంకు వినియోగదారుడు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: