లేబర్ కోడ్ల రద్దుకై చలో ఢిల్లీ---- సిఐటియు
తెలంగాణ కెరటం నల్లగొండ జిల్లా ప్రతినిధి: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించాలని లేబర్ కోడ్ల రద్దుకై డిసెంబర్ 1 నుండి 3 వరకు చలో పార్లమెంట్ ఢిల్లీ ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు రాష్ట్ర మిటీ పిలుపుమేరకు కార్మిక హక్కులు రక్షించాలని డిఈఓ ఆఫీస్ ఎదురుగా గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సలీంమాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా చేసిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 42000 కనీస పెన్షన్ పెంపు స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిసెంబర్ 1 నుండి 3 వరకు చలో ఢిల్లీ పార్లమెంటుకు వెళ్దాం అనే నినాదంతో వేలాదిమంది చలో ఢిల్లీకి తరలిరావాలని కోరారు. మోడీ ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెచ్చి కనీస వేతనాన్ని మరింత దిగజార్చిందని ఆరోపించారు. 8 గంటల పని విధానానికి మంగళం పాడిందని, ఉద్యోగ భద్రత కాలరాసింది. సమ్మె చేయకుండా ఆటంకాలు విధించిందని అన్నారు. కోట్లాదిమంది కార్మికులకు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా వెలుపలికి నెట్టిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కులు సమస్యలు పరిష్కరించడంలో బిజెపి అడుగుజాడల్లో నడుస్తుందని, కార్మిక లేబర్ కోడ్ లు వ్యతిరేకించకుండా వారికి రూల్స్ రూపొందించి అమలు చేయడానికి �



