మాహనీయుల స్ఫూర్తి వేదిక
రాష్ట్ర చైర్మన్
ప్రజావాగ్గేయకారుడు
రాజారాం ప్రకాష్
వీరనారి ఝల్కారీ బాయి
ఝాన్సీ పోరాట యోధురాలు ఝల్కారీబాయి
బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధురాలు
దుర్గా వాహిని సంస్థాపకులు ఝల్కారిబాయి
ఆదివారం(22.11.2026) రోజువనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వీరనారి ఝల్కారీ బాయి 197వ జయంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్
ప్రజావాగ్గేయకారుడు
రాజారాంప్రకాష్
మాట్లాడుతూ
భారత దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం కొనసాగించినటువంటి ధీరవనిత ఝల్కారీబాయి
ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యంలో మహిళా సైన్యాధ్యక్షురాలుగా సేవలందించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినది ఝల్కారీబాయి .
1857 సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి ఝాన్సీ ప్రాంతాన్ని రక్షించిన వీరవనిత ఝల్కారీబాయి
ఝల్కారీబాయి ఝాన్సీ ప్రాంతంలో పోరు పతాకం ఎగరేసి శత్రువుల కుత్తుకల తెగనరికి తెల్లవారి గుండెల్లో నిలిచిన మహోన్నతమైన దళిత పోరాట యోధురాలు.
బ్రిటిష్ సైన్యం బారి నుండి తనను తన బిడ్డను రక్షించుకోవడం కోసం లక్ష్మీబాయి ఒక ప్రాంతానికి పారిపోతే నేనేరా లక్ష్మీబాయి నాతో యుద్ధం చేయండి అంటూ అరివీర భయంకరంగా పోరాడి వీరమరణం పొందినది ఝల్కారీబాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి పట్ల నిజమైన స్నేహం తో మాతృభూమి రక్షణ కోసం స్వాతంత్రం కోసం నిజాయితీగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కర్తవ్య నిర్వహణలో వీరమరణం పొందిన వీరనారి ఝల్కారిబాయి ఎప్పటికి ఆమె చిర స్మరణీయులు
ఝల్కారీబాయిధీరత్వం వీరత్వం సాహసం చూసి బ్రిటీష్ గవర్నర్ జనరల్ మాట్లాడుతూ హిందుస్థాన్ లోని స్త్రీలలో ఒక్క శాతం అయినా ఝల్కారిబాయి లాగ స్వాతంత్రం కోసం పోరాడి ఉంటే నేను ఏనాడు ఎప్పుడూ ఈ దేశం విడిచి పారిపోవలసి వచ్చేది నిజంగా గొప్ప పోరాట యోధురాలు అని కొనియాడారు.
అందుకే ప్రతి వ్యక్తి చరిత్రను చదివి మనం చైతన్యం కావాలి నాటి తరాలు ఆకలి అవమానం అంటరానితనం నుండి బయటపడి చేసిన పోరాటాన్ని వారి త్యాగాన్ని తప్పకుండా స్మరించుకోవాలి రాజ్యాంగం,అంబేద్కర్ చరిత్ర మహానీయుల చరిత్రను గొప్పతనాలను తెలుసుకొని ఈ దేశం కోసమే బతకాలని, బతికి ఈ దేశపు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ కోరారు
ఈ కార్యక్రమంలో
కవిపండితుడు భూరోజు గిరిరాజా చారి
కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
గాయకుడు చింతకుంట కురుమయ్య ,
విశ్రాంత ఇంజనీరు శ్రీనివాసులు శెట్టి
శాలివాహన సంఘం నాయకులు సూరి రాము, వెంకటయ్య
ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులు వెంకటస్వామి, ఆది వెంకటేష్,
యుటిఎఫ్ నాయకుడు తిమ్మప్ప మాధవాచారి
ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ వనపర్తి జిల్లా సభ్యుడు ఎడవల్లి వీరప్ప
మొదలగు వారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మి
ప్రజావాగ్గేయకారుడు
రాజారాంప్రకాష్



