Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంబులెన్స్ కంటే ముందే స్పందించిన మునగాల పోలీసులు

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 07:31 AM | 6 | Politics, తెలంగాణ
అంబులెన్స్ కంటే ముందే స్పందించిన మునగాల పోలీసులు
తెలంగాణ కెరటం | సూర్యాపేట జిల్లా
నవంబర్ 22ప్రతినిధి: సీహెచ్. నవీన్
అంబులెన్స్ కంటే ముందే స్పందించిన మునగాల పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ సంజీవరెడ్డి మునగాల:సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై (పెట్రోల్ బంక్ ఎదురుగా) రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుండి కోదాడ వైపు స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలు, అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి తన సిబ్బందితో కలిసి అంబులెన్స్ కంటే ముందే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను పోలీసు వాహనంలోనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. సకాలంలో స్పందించి బాధితులకు అండగా నిలిచిన మునగాల పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: