Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 07:42 AM | 5 | Politics, తెలంగాణ
నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నిండు జీవితానికి రెండు చుక్కలు..
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్పటాన్చెరుదేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సిఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని..చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, వైద్యులు పట్లోల మనోహర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: