తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : కోరుట్ల పట్టణంలోని 19,వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు అండగా నిలుస్తూ, స్థానిక వార్డు కౌన్సిలర్ ఎండి మోసిన్, నాయకులు మిట్టపల్లి రాజశేఖర్, అబూబకర్ లు సోమవారం నూతన చేయూత పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా సేవే లక్ష్యంగా, ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం..ప్రజా సేవే మా ధ్యేయం అని పేర్కొన్నారు.
19,వ వార్డులో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



