తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : కథలాపూర్ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అన్ని గ్రామాల నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలు సోమవారం కరీంనగర్ లో జరిగిన బీజేపీ పాదయాత్రకు తరలివెళ్లారు. "ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచక వాదాన్ని అంతం చేద్దాం" అనే నినాదంతో ఈ పాదయాత్ర కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి నంద్యాడపు వెంకటేష్, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, గాంధారి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ప్రతాప్, జలంధర్, నరేష్, అశోక్, మహేష్, సునీల్, రఘు, వెంకటేష్, శ్రీకర్, వినోద్, లక్ష్మణ్, లక్ష్మీ నారాయణ, తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహా పాదయాత్రకు తరలిన కథలాపూర్ మండల బిజెపి శ్రేణులు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



