Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మిరుదొడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం -ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి -కుంట కుటుంబ సభ్యుల సేవాభావం అభినందనీయం – పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయం

Author
Posted By Kancharala Shivakumar
| 24 Nov 2026, 11:43 AM | 58 | తెలంగాణ
మిరుదొడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం -ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి -కుంట కుటుంబ సభ్యుల సేవాభావం అభినందనీయం – పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయం

దుబ్బాకప్రతినిధి,మిరుదొడ్డి, నవంబర్ 24:(తెలంగాణ కెరటం)

మిరుదొడ్డి మండల కేంద్రంలో కుంట జితేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, సౌందర్యల జ్ఞాపకార్థం, ఎల్వీ ప్రసాద్ నేత్ర సంస్థ సహకారంతో, కుంట సుకన్య – గోపాల్ రెడ్డి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిబిర నిర్వాహకులను అభినందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.తమ ఆత్మీయుల జ్ఞాపకార్థం కుంట కుటుంబ సభ్యులు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆదర్శనీయమని పలువురు ప్రశంసించారు. కుంట కుటుంబ సభ్యుల సేవాభావం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూపాల్ గౌడ్, సీనియర్ నాయకులు భూమా గౌడ్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి పద్మారెడ్డి, అల్వాల గ్రామ మాజీ సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య, గుల్ల నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రం, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: