శ్రీకృష్ణ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్
శాలువాతో మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన అర్చకులు
ఎల్లారెడ్డి తెలంగాణ కెరటం (ప్రతినిధి) నవంబర్ 24
సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీ కృష్ణమందిర్ ఆలయం కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
అనంతరం అర్చకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో విరసిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీ కృష్ణమందిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మనస్ఫూర్తిగా ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు రాజేశ్వరరావు నర్సింలు తాడ్వాయి మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు మండల ప్రధాన కార్యదర్శి తీగల నాగ గౌడ్ గని రమేష్ బుచ్చయ్య పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



