వ్యక్తిగత సమాచారం పేరుతో ఆర్టీఐ దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించరాదు
సెక్షన్ 10(1), 8(2) నిబంధనలను వినియోగించుకోవాలి
హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 24
సమాచార హక్కు చట్టం–2005 కింద కోరిన సమాచారంలో వ్యక్తిగత వివరాలు ఉన్నాయనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించవద్దని కుమార్ పల్లెబోయిన సూచించారు. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023లోని సెక్షన్ 44(3) ద్వారా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) సవరించబడిందని, ఈ మార్పు 2025 నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అయితే సెక్షన్ 10(1) ప్రకారం రికార్డులో మినహాయింపుకు గురయ్యే వ్యక్తిగత సమాచారాన్ని మిగిలిన వివరాల నుంచి వేరు చేయడం సాధ్యమైతే, మిగతా సమాచారాన్ని అందించవచ్చని వివరించారు.
ప్రభుత్వ నియామకాలు, ఎంపిక ప్రక్రియలు, పరీక్షల ఫలితాలు, పరిపాలనా రికార్డుల్లో వ్యక్తిగత వివరాలున్నాయనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించకుండా ఈ నిబంధనను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సెక్షన్ 8(2) ప్రకారం సమాచార వెల్లడితో కలిగే ప్రజాప్రయోజనం, రక్షించాల్సిన ప్రయోజనాలకు కలిగే హానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉందన్నారు.
సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19(1) కింద మొదటి అప్పీల్, పరిష్కారం లభించకపోతే సెక్షన్ 19(3) కింద రెండో అప్పీల్ దాఖలు చేసి చట్టబద్ధంగా తమ వాదనలు వినిపించాలని కోరారు.
సెక్షన్ 10(1), 8(2) నిబంధనలు ప్రతి సందర్భంలోనూ మొత్తం సమాచారాన్ని పొందే హామీ ఇవ్వవని, వాటిని పరిస్థితులకు అనుగుణంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనలపై ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలని, పారదర్శక పాలన, ప్రజల హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలనే వ్యక్తిగత సమాచారం పేరుతో ఆర్టీఐ దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించరాదు
సెక్షన్ 10(1), 8(2) నిబంధనలను వినియోగించుకోవాలి
హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 24
సమాచార హక్కు చట్టం–2005 కింద కోరిన సమాచారంలో వ్యక్తిగత వివరాలు ఉన్నాయనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించవద్దని కుమార్ పల్లెబోయిన సూచించారు. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023లోని సెక్షన్ 44(3) ద్వారా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) సవరించబడిందని, ఈ మార్పు 2025 నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అయితే సెక్షన్ 10(1) ప్రకారం రికార్డులో మినహాయింపుకు గురయ్యే వ్యక్తిగత సమాచారాన్ని మిగిలిన వివరాల నుంచి వేరు చేయడం సాధ్యమైతే, మిగతా సమాచారాన్ని అందించవచ్చని వివరించారు.ప్రభుత్వ నియామకాలు, ఎంపిక ప్రక్రియలు, పరీక్షల ఫలితాలు, పరిపాలనా రికార్డుల్లో వ్యక్తిగత వివరాలున్నాయనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించకుండా ఈ నిబంధనను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సెక్షన్ 8(2) ప్రకారం సమాచార వెల్లడితో కలిగే ప్రజాప్రయోజనం, రక్షించాల్సిన ప్రయోజనాలకు కలిగే హానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉందన్నారు.సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19(1) కింద మొదటి అప్పీల్, పరిష్కారం లభించకపోతే సెక్షన్ 19(3) కింద రెండో అప్పీల్ దాఖలు చేసి చట్టబద్ధంగా తమ వాదనలు వినిపించాలని కోరారు.
సెక్షన్ 10(1), 8(2) నిబంధనలు ప్రతి సందర్భంలోనూ మొత్తం సమాచారాన్ని పొందే హామీ ఇవ్వవని, వాటిని పరిస్థితులకు అనుగుణంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనలపై ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలని, పారదర్శక పాలన, ప్రజల హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలనే లక్ష్యాలని కుమార్ పల్లెబోయిన పేర్కొన్నారు. కుమార్ పల్లెబోయిన పేర్కొన్నారు.



