Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 08:34 PM | 9 | Politics, తెలంగాణ
హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి కార్యాలయం హనుమకొండ

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 25

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ట్రాన్సిట్ బూత్‌లను సందర్శించి, అక్కడ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రామ్ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడవ రోజు మొత్తం 416 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. అదేవిధంగా 75,387 ఇళ్లను సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహించారు.
జిల్లా పల్స్ పోలియో కార్యక్రమం లక్ష్యం 84,654 మంది చిన్నారులు కాగా, తుది రోజు నాటికి మొత్తం 84,816 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 100.2 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఇతర శాఖల సమన్వయం, సిబ్బంది అంకితభావం, సమిష్టి కృషి వల్లే నిర్దేశించిన లక్ష్యానికి మించి 100.2 శాతం ప్రగతి సాధించడం సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి హనుమకొండ జిల్లా.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: