Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

'సంకల్పం' ఆనందం ఆకాశమంత..

Author
Posted By D RAMAKRISHNA
| 24 Nov 2026, 10:22 PM | 3 | TELANGANA, ఖమ్మం, తెలంగాణ
'సంకల్పం' ఆనందం ఆకాశమంత..

'సంకల్పం' ఆనందం ఆకాశమంత..

  •  ప్రకృతితో మమేకమైతేనే జీవన విలువలు మెరుగుపడుతాయి
  •  ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య
  •  తలసేమియా చిన్నారుల వనభోజనాలలో సందడి

ఖమ్మం, నవంబర్ 24 : తలసేమియా చిన్నారుల మల్లెపూల లాంటి చిరునవ్వుల ముందు ప్రకృతి సోయగాలు సైతం కళ్లు చెదిరిపోయాయని.. ఈ వేడుకలతో సంకల్ప సంస్థ ఆనందం ఆకాశాన్ని అంటిందని ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి వారి మామిడి తోటలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు ఆడిపాడారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. అనంతరం సంకల్ప సంస్థ ఫౌండర్‌ పి.అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ కార్తీక మాసంలో అందరూ కలిసి ఆటపాటలు ఆడుకుంటూ, భక్తిభావంతో పూజలు చేసేందుకే వనభోజనాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రకృతితో ఒకసారి మమేకమైతే మన జీవనం గతం నుంచి ఇప్పటివరకు ఎలా సాగిందో తెలుస్తుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం ఇందులో దాగి ఉంటుందని వివరించారు. ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దాని కింద వనభోజనాలు చేయడం మన సంప్రదాయమని తెలిపారు. ఆటపాటలు, భజనలు, ఆనందోత్సాహాల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఓలివ్‌ క్రిఫ్టో సిస్టమ్స్‌ సంస్థ అధినేత జి.భారవి మాట్లాడుతూ సంకల్ప సంస్థతో తన ప్రయాణం 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, చిన్నారులకు సేవ చేసేందుకు ఆ ప్రయాణం కొనసాగుతుందన్నారు. సంస్థ ఫౌండర్‌ పి.అనిత మాట్లాడుతూ ఓలివ్‌ క్రిప్టో సిస్టమ్‌ అధినేత భారవి సహకారంతో తలసేమియా చిన్నారులకు మందులతో పాటు ఐరన్‌ చిలేషన్‌ ఇంజక్షన్ల కోసం మిషన్లను సమకూర్చుకోగలిగామని తెలిపారు. 12 ఏళ్లుగా చిన్నారులకు సేవలందించేందుకు సహకారం అందిస్తున్నారని, తలసేమియా చిన్నారుల కోసం బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో అండగా నిలబడ్డారన్నారు. హైదరాబాద్‌ కార్యాలయంలో తమ సంస్థ ఉద్యోగుల ద్వారా రక్తదానం చేయిస్తున్నారని కొనియాడారు. ఇటువంటి దాతల సహకారంతోనే చిన్నారులు నిశ్చింతగా జీవిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణ మూర్తి, ఓలివ్‌ క్రిప్టో సిస్టమ్స్‌ సంస్థ బాధ్యులు సుజాత, సంకల్ప సంస్థ కార్యదర్శి ప్రభాకర్, ఉపాధ్యక్షురాలు పి.పావని, ఉదయ్‌ భాస్కర్, రవిచందర్, ఎన్‌.ఉపేందర్, కస్తూరి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: