Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* *పథకానికి విశేష స్పందన* *ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్న* *ప్రభుత్వం: *సర్పంచ్ ఎర్రం లింగం*

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 10:38 PM | 4 | Politics, తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* *పథకానికి విశేష స్పందన* *ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్న* *ప్రభుత్వం: *సర్పంచ్ ఎర్రం లింగం*
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* *పథకానికి విశేష స్పందన*
*ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్న* *ప్రభుత్వం: *సర్పంచ్ ఎర్రం లింగం*

*నిజామాబాద్ జిల్లా* *తెలంగాణ కెరటం*

*నందిపేట్ మండల* గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో చేరేందుకు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో ముందుకు వస్తున్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నమోదు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం పాల్గొని ప్రజలకు పథకం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రతి కుటుంబానికి జీవిత బీమా ఒక రక్షణ కవచం లాంటిది. అనుకోని ఆపద సమయంలో కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు తమ వివరాలను నమోదు చేసుకుని బీమా పత్రాలను పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: