Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 06:50 AM | 5 | Politics, తెలంగాణ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.. బాధితులకు సకాలంలో పరిహారం అందించాలి

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్‌ ప్రతినిధి/నవంబర్ 24: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. కీసర డివిజన్‌లో ఆర్డీఓ వెంకట్ రెడ్డి అధ్యక్షతన, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గోపీచంద్ కన్వీనర్‌గా డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించే అంశంపై చర్చించారు. అదేవిధంగా అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం అందించే ఆర్థిక పరిహారం మంజూరు, పంపిణీతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాల అమలుపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ఏమాత్రం జాప్యం లేకుండా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. బాధితులకు చట్టప్రకారం అందాల్సిన ఆర్థిక పరిహారం సకాలంలో మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని, వారికి న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, తాల్క రాములు, ధన్‌రాజ్ నాయక్‌తో పాటు ఉప్పల్, మేడిపల్లి, జవహర్‌నగర్ ఏసీపీలు, అన్ని మండలాల తహసీల్దార్లు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: