Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 04:40 PM | 4 | Politics, తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి

తెలంగాణ కెరటం 
నవంబర్ 26
తాడ్వాయి ప్రతినిధి 

సంగోజివాడి గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.  మాజీ ఉప సర్పంచ్ గైని శివాజీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య గ్రంథం. కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగం ప్రధాన లక్ష్యం.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి, దూరదృష్టి భారతదేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసింది. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం, అణగారిన వర్గాల ఆశాజ్యోతి.
వివక్షను ప్రశ్నిదం అన్యాయాన్ని ఎదురిదాం సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని మాట్లాడారు... ఈ కార్యక్రమం లో  గంట బాలరాజు, ఎండీ. ఖయ్యుమ్, ఎండీ, కరామత్, మైముద్,ఎండీ ఫారూక్, హమీద్, సందీప్, భరత్ కుమార్,బాల పోషయ్య,చిన్న నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: