Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్మిక చట్టాల పేరుతో కార్మికుల హక్కులను కాలరాయొద్దు

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 01:30 AM | 3 | Politics, తెలంగాణ
కార్మిక చట్టాల పేరుతో కార్మికుల హక్కులను కాలరాయొద్దు
నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి గిన్నారపు మహేందర్
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం (బీఎన్‌ఆర్‌కేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రమశక్తి అవార్డు గ్రహీత గిన్నారపు మహేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్శించారు. ఈ నాలుగు కోడ్ల ద్వారా కార్మికుల సంక్షేమం, హక్కులు, సంఘాల స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగు లేబర్ కోడ్లు ఇవే:1. వేతనాల కోడ్2. పారిశ్రామిక సంబంధాల కోడ్3. సామాజిక భద్రత కోడ్4. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ఈ కోడ్ల అమలుతో కార్మిక సంఘాల స్వతంత్రత తగ్గి యాజమాన్యాల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని మహేందర్ పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతాయని తెలిపారు. కార్మిక సంఘాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, తక్కువ వేతనాలకు పనిచేసే సంఘాలకు పనులు అప్పగించే పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె హక్కులు, కార్మికుల ఉద్యోగ భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. గతంలో కార్మికులకు ఉన్న అనేక హక్కులు, వెసులుబాట్లు ఈ కొత్త కోడ్ల వల్ల తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఒకే వైద్యుడు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసినట్లుగా, భిన్నమైన కార్మిక సమస్యలను ఒకే విధానంలో పరిష్కరించాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నాలుగు లేబర్ కోడ్లు ప్రధానంగా కాంట్రాక్టు కార్మికులు, పరిశ్రమల కార్మికులు, సంఘటిత మరియు అసంఘటిత రంగాల కార్మికులు, గిగ్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితర వర్గాలపై ప్రభావం చూపుతాయని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటమే లక్ష్యం భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘాలు నిరంతరం పోరాటం చేయాలని మహేందర్ పిలుపునిచ్చారు. నకిలీ కార్మికులను గుర్తించి ఏరివేయాలని, ఉపాధి హామీ కార్మికులను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాడాలని సూచించారు. కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత, హక్కుల సాధన కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని గిన్నారపు మహేందర్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: