ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుర్పంగ శివలింగం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత వార్డు సభ్యుడు జాలిగం కనకరాజును ఆ కారణంగా అక్రమంగా నిర్బంధించి చితకబాదిన ఎస్సై శ్రీశైలం ను వెంటనే సస్పెండ్ చేసి జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుర్పంగ శివలింగం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం ఏఎస్ఐ మైహిపాల్ ఫోన్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కు రావాలని లేకుంటే ఇంటికి వచ్చి నిన్ను పోలీస్ జీపులో స్టేషన్కు తీసుకువచ్చి నీ అంతు చూస్తామని బెదిరించడం జరిగిందని నేను వివాహ వేడుకలో ఉన్నానని రేపు ఉదయం 10 గంటలకు వస్తానని చెప్పినా బ్రతిమిలాడినా కూడా వినకుండా మరుసటి రోజు తేదీ 23 న ఉదయం అన్నట్లుగానే ఇద్దరు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లతో కూడిన వాహనాన్ని ఇంటికి పంపించి అక్రమంగా జాలిగం కనకరాజును నిర్బంధించి అసభ్య పదజాలాలతో తిడుతూ అవమానకర రీతిలో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న వారి వద్ద కూర్చోమని చెప్పి నేను ఏ నేరం చేయలేదు దొంగలతో సమానంగా నేను కూర్చోలేను అని ఎంత మొరపెట్టుకున్నా వినకుండా స్టేషన్లో నిర్బంధించారని, తదుపరి ఎస్సై శ్రీశైలం గారు స్టేషన్ కు చేరుకోగానే వెంటనే జాలిగం కనకరాజు మీదకు వస్తు అసభ్య పదజాలాలతో తిడుతూ కొడకా మాదిగ లంజాకొడకా నిన్ను పండబెట్టి తొక్కుతా నీ తోడుకలు తీస్తా నీ అంతు చూస్తా అంటూ ఇష్టం వచ్చిన రీతిలో కొట్టడం జరిగిందని జాలిగం కనకరాజుకు మరియు మర్రి ఆగం రెడ్డికి గల అప్పు విషయంపై పోలీస్ స్టేషన్లో ఇలాంటి సివిల్ సెటిల్మెంట్లు చేయకూడదని నిబంధన ఉన్నా కూడా అగ్రకులానికి చెందిన మరి ఆగం రెడ్డి అనే వ్యక్తి ని కుర్చీలో కూర్చోబెట్టి అతని ముందే దళిత వార్డు సభ్యుడు జాలిగం రాజును ఇష్టా రీతిలో కొడుతూ తిడుతూ చంపుతానని బెదిరించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పు, డబ్బు లావాదేవీల విషయమై చట్ట ప్రకారం పోలీసులు జోక్యం చేసుకోవద్దని చట్టం పోలీస్ ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా కూడా బొమ్మలరామారం ఎస్సై శ్రీశైలం మరియు ఏఎస్ఐ మహిపాల్ మరియు తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి ఎలాంటి అరెస్టు వారేంటో పోలీసు కేసు కారణం లేకుండా ఉదయం ఆరు గంటలకు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి కనకరాజును నిర్బంధించి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్ పై పూర్తిస్థాయి విచారణ జరిపించి తగిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టివ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిన్న ఎస్పీ అక్షాంశాదవ్ గారికి ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు స్పందించకపోవడం బాధాకరమని వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ గారు అక్షాంశ యాదవ్ మరియు డిఎస్పి రవీందర్ యాదవ్ గారు జోక్యం చేసుకొని బొమ్మలరామారం ఎస్సై శ్రీశైలం ను వెంటనే సస్పెండ్ చేసి తగు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా కార్యదర్శి అనంపట్ల కృష్ణా ,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం శంకర్, ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్, ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, కౌన్సిలర్ జాలిగం విగ్నేష్, టీపీసీసీ నాయకులు దర్గాయి హరిప్రసాద్, జాలిగం హరి శివప్రసాద్ దర్గాయి గణేష్, తదితరులు పాల్గొన్నారు.



