సవాల్ విసిరిన బిజెపి నాయకులు
ఓటర్ల శుద్దీకరణ అనేది నిరంతర ప్రక్రియ
బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రాజకీయ స్వార్థంతో రాజ్యాంగ సవరణలు, ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసి నేడు రాజ్యాంగ రక్షణ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు నీతులు చెప్తే ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. బుధవారం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్మణ్ కుమార్ ఓటర్ల శుద్దీకరణ ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, మంత్రి వ్యాఖ్యలను తాము స్వీకరిస్తున్నామని జగిత్యాల జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలోని తండాలో అయినా గూడెంలో అయినా ఏఒక్క హరిజన, గిరిజన, ఆదివాసీల, బడుగు బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఏ ఒక్కరి ఓటు బిజెపి తీసేసినట్లు రుజువు చేస్తే, తాము దేనికైనా సిద్ధమని, ఒకవేళ రుజువు చేయకపోతే శాసన సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తారా.. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సహకరిస్తుందని పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హామ్ శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ నుండి పారిపోయారని మంత్రి అడ్లూరి చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్ పై సుప్రీం కోర్టులో వేసిన ఫిర్యాదుపై ఆధారాలు చూపాలని రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.తెలంగాణలో అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి విస్మరించినందుకు మళ్ళీ రెండవసారి అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.ఏపార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీతో ప్రభుత్వాన్ని తో సంబంధం లేకుండా ధర్మపురి నియోజకవర్గంలో 100 రోజుల్లో బస్ డిపో, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని చేయనందుకు మల్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాల అని వ్యంగ్యాస్త్రం సంధించారు.హామీల అమలు చేతకాక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని అందుకే ప్రతిగా 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మపురి ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీకి దాదాపు తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన విషయం తెలుసుకోవాలని అన్నారు. ఎప్పుడో చనిపోయిన పీవీ నరసింహారావు ఓటు ఇంతవరకు తొలగించలేదని, ఇప్పుడు ఓటర్ల జాబితా శుద్ధికరణలో భాగంగా తొలగించడం తప్పా.. ఇదే కాకుండా మొన్నటి వరకు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్న ఎమ్మెల్యేల అందరి ఓట్లు వారి సొంత ఊర్లతో పాటు జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాయన్నారు. అలాంటి ఓట్లు తొలగించడం తప్పా అని ప్రశ్నించారు. సర్ ప్రక్రియకు ముందు ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీల నుండి బూతు లెవెల్ ఏజెంటు 02 ను నియమించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని, అందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారని అలాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా తొలగించినట్లు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సర్ అనేది కొత్తగా వచ్చినది కాదని నరేంద్ర మోడీ తెచ్చినది కాదని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 8సార్లు ఓటర్ల శుద్దీకరణ కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగానే చనిపోయిన వారి ఓట్లు రెండోసార్లు నమోదైన ఓట్లు బదిలీపై ఒకచోట నుండి ఒక చోటికి వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నొప్పి ఏంటని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు మేడవేని శ్రీధర్, మండల ఇంచార్జి కస్తూరి సత్యం, స్వచ్ఛ భారత మాజీ రాష్ట్ర కన్వీనర్ మంచె రాజేష్, మండల నాయకులు కప్పల మల్లేష్, గొండ వెంకటేష్, సుంకం ప్రశాంత్, మల్లేశం, సుంకం తిరుపతి, జంగ రమేష్, చీపిరిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.



