Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 05:49 AM | 10 | Politics, తెలంగాణ
అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

సంగారెడ్డి గంజ్ మైదాన్ లో జరిగిన వివాహ వేదిక కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

వివాహ వేడుకకు హాజరైన ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు

వేలాదిగా తరలివచ్చిన జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు

News Image

ఇవి కూడా చదవండి

అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్‌ల వివాహ మహోత్సవం బుధవారం సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని గంజ్ మైదాన్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, జగ్గారెడ్డి, నిర్మల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వివాహ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, మహమ్మద్ అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.సంగారెడ్డిలో పెళ్లి సందడి జగ్గారెడ్డి కుమారుడి వివాహ మహోత్సవానికి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్ర రాజకీయ ప్రముఖుల రాకతో వివాహ వేదిక సందడిగా మారింది. ఓ వైపు రాజకీయ ప్రముఖులు, మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో గంజ్ మైదాన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్‌ల వివాహ వేడుక వైభవోపేతంగా జరిగింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: