ఘట్కేసర్లో ఘనంగా ఆత్మీయ ఫెలోషిప్ కార్యక్రమం
పాస్టర్లు, క్రైస్తవ నాయకుల ఐకమత్యానికి వేదికగా సమావేశం
దేవునిపై విశ్వాసం, ఆధారపడటంపై ప్రత్యేక వాక్య సందేశం
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 25: ఘట్కేసర్ మండల పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ (జీఎంపీఎల్ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 24న అన్నోజిగూడలోని న్యూ లైఫ్ కవెనెంట్ ఏజీ చర్చిలో ఆత్మీయ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘ పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు, ఆరాధన, వాక్య సందేశంతో ఆత్మీయ ఐకమత్యాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి న్యూ లైఫ్ కవెనెంట్ ఏజీ చర్చి పాస్టర్ రెవ. డి. శ్రీ సంజయ్ వేదికతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. ముఖ్య అతిథి వక్తగా విచ్చేసిన రెవ. విక్రమ్ షిండే (ఏజీ) కీర్తనలు 20వ అధ్యాయం ఆధారంగా దేవునిపై విశ్వాసం ఉంచడం, కష్టసమయాల్లో ఆయనపై ఆధారపడటం వంటి అంశాలపై విలువైన వాక్య సందేశాన్ని అందించారు. పాటల ద్వారా ఆరాధనను నడిపించిన పాస్టర్ అమ్మలూ గారికి, ఆరాధనలో సేవలందించిన న్యూ లైఫ్ కవెనెంట్ ఏజీ చర్చి యువజన బృందానికి నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఘనత వహించిన మాజీ ఫెలోషిప్ అధ్యక్షులు బి.ఎన్. ఫిలిప్, జాన్ జోసెఫ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. జీఎంపీఎల్ఏ అధ్యక్షులు జాన్ మార్క్ భూపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. శ్రీ రాజేష్, ప్రధాన కార్యదర్శి ఇ. మార్టిన్, కోశాధికారి పి. సునీల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, శాంసన్, సూర్యప్రకాశ్, సంయుక్త కార్యదర్శి రవి జెరెమియా, ఎం. సంజయ్, కె. డేవిడ్, ప్రణయ్, యాదగిరి, చార్లెస్, పాస్టర్ యెర్రా సంజీవ్ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. అలాగే మేడిపల్లి మండల పాస్టర్ల ఫెలోషిప్, ప్రిజాదిగూడ పాస్టర్ల ఫెలోషిప్ ప్రతినిధులతో పాటు పాస్టర్ జాకబ్, పాస్టర్ మార్క్, రెవ. జెస్సీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రైస్తవ మైనారిటీ మేడ్చల్ నియోజకవర్గ నాయకుడు డి. కాలేబ్ కెన్నీ, నాయకులు యెర్ర రాజు మాధవి, సోలమన్, వెంకటేష్, ఎం. ప్రభుదాస్ తదితర క్రైస్తవ నాయకులు హాజరై కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సోదరభావం, క్రైస్తవుల ఐకమత్యం, సంఘాల అభివృద్ధి, దేవుని పరిచర్య విస్తరణ వంటి పలు అంశాలపై ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన చర్చి నిర్వాహకులకు, ముఖ్య అతిథులకు, పాస్టర్లకు, సంఘ పెద్దలకు, క్రైస్తవ నాయకులకు జీఎంపీఎల్ఏ కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బైబిల్లోని కీర్తనలు 133:1లో పేర్కొన్న “సహోదరులు ఐకమత్యముగా నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” అనే వాక్యాన్ని స్మరించుకుంటూ, క్రైస్తవ సమాజ అభివృద్ధికి, దేవుని రాజ్య విస్తరణకు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసి పనిచేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమావేశాల ద్వారా పరస్పర సహకారం, సోదరభావం మరింత బలోపేతం కావాలని ప్రార్థించారు.



