Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..... మందమర్రి ఏరియాలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు.

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 07:00 AM | 3 | Politics, తెలంగాణ
సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..... మందమర్రి ఏరియాలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు.
సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..... మందమర్రి ఏరియాలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు....... 
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు...
మంచిర్యాల...
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు ఉదయం ఉద్యోగులు మరియు సిబ్బంది కోసం ప్రత్యేక ‘సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం’ జిఎం హెచ్.ఆర్డి (కార్పొరేట్) ఆదేశానుసారంగా,    మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ  మరియు మందమర్రి ఏరియా జి వి టి సి  ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఏజీఎం (ఫైనాన్స్ & అకౌంట్స్) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్  ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఐటీ  డి.వై. మేనేజర్  కె.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలను విపులీకరించారు.కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం నుండి వ్యక్తిగత జీవితంలో స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ లావాదేవీల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సులభంగా అర్థమయ్యేలా వివరించారు. 
1. సైబర్ భద్రత – సమష్టి బాధ్యత:
సైబర్ భద్రత అనేది కేవలం ఐటీ విభాగం బాధ్యత మాత్రమే కాదు, సంస్థలోని ప్రతి ఉద్యోగి బాధ్యత.ఒక్క చిన్న నిర్లక్ష్యపు చర్య మొత్తం సంస్థ భద్రతను ప్రమాదంలో పడేయగలదు; అదే సమయంలో బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన మన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలను రక్షిస్తుంది.
2. వ్యక్తిగత జీవితంలో సైబర్ భద్రత ప్రయోజనాలు:
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి: ఆన్‌లైన్ మోసాలు, గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ తెఫ్ట్ ), ఆర్థిక నష్టాలు, గోప్యతా ఉల్లంఘనలు మరియు డిజిటల్ వేధింపుల నుండి సైబర్ భద్రత మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కాపాడుతుంది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ  లావాదేవీలు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్ మరియు వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాలను సురక్షితంగా ఉపయోగించేందుకు ఇది తోడ్పడుతుంది.
కొత్త తరహా మోసాలను గుర్తించడం: సురక్షితమైన డిజిటల్ పద్ధతులను పాటించడం వల్ల వ్యక్తిగత ఫోటోలు, ముఖ్యమైన పత్రాలు, ఆర్థిక సమాచారం మరియు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. నకిలీ పెట్టుబడి పథకాలు, మోసపూరిత ఫోన్ కాల్స్, హానికరమైన యాప్‌లు మరియు ఏ.ఐ  ఆధారిత మోసాలను గుర్తించడంలో ఈ అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాల్ ఫార్వార్డింగ్, డిజిటల్ అరెస్ట్  మరియు డీప్‌ఫేక్ వీడియోల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.3. వివిధ రకాల సైబర్ దాడులు – అప్రమత్తత:
ఫిషింగ్ : సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించిన నకిలీ ఈ-మెయిల్స్ లేదా వెబ్‌సైట్లు.స్మిషింగ్ : హానికరమైన లింక్‌లతో కూడిన మోసపూరిత ఎస్ఎంఎస్  సందేశాలు.
విషింగ్ : సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టడానికి చేసే మోసపూరిత వాయిస్ కాల్స్.
మాల్‌వేర్: కంప్యూటర్ లేదా మొబైల్ సిస్టమ్‌లను దెబ్బతీసే లేదా హ్యాక్ చేసే హానికరమైన సాఫ్ట్‌వేర్.ర్యాన్సమ్‌వేర్ : మన డేటాను లాక్ (ఇన్క్రిప్ట్ ) చేసి, దానిని తిరిగి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేసే సైబర్ దాడి. అనంతరం ముఖ్య అతిథి ఏజీఎం (ఎఫ్ & ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్  మాట్లాడుతూ, పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, ఉద్యోగులందరూ నేర్చుకున్న ఈ మెలకువలను తమ కుటుంబ సభ్యులకు, తోటి వారికి తెలియజేసి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సిహెచ్.అశోక్,
డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, దేవులపల్లి శ్రీనివాస్,(జే టి ఓ) జి వి టి సి,  కే.సుమన్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మరియు జిఎం ఆఫీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: