Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోహన్ రావు పేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 06:19 PM | 3 | Politics, తెలంగాణ
మోహన్ రావు పేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
మోహన్ రావు పేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని టీపీసీసీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం గ్రామ సర్పంచ్ సరికెళ్ల లతిక నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసినందుకు మోహన్ రావు పేట గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారావు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మోహన్ రావు పేటలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు కండె లక్ష్మణ్ ఇంటికి జువ్వాడి కృష్ణారావు, గ్రామ సర్పంచ్ సరికెళ్ళ లతిక నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: