Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు..

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 07:00 PM | 4 | Politics, తెలంగాణ
ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు..
ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు..

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్ 

జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 9,960 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు..
అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ( టి ఎస్ యల్ ఆర్ బి ) ఆధ్వర్యంలో నవంబర్ 29వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 9,960 మంది అభ్యర్థులు ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకానున్నారని ఎస్పీ వెల్లడించారు. ఉదయం 10:00 గంటల నుంచి మద్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా పరీక్షా హాలులోకి అనుమతిమచడం జరుగుతుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరీక్ష పూర్తయ్యే వరకు జిరాక్స్ కేంద్రాలను తెరవడానికి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా గుమిగూడడం, అనవసరంగా తిరగడం నిషేధం. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతరం నిఘా కొనసాగుతుందని, పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
1.హాల్ టికెట్‌పై ఫోటోకు కేటాయించిన స్థలంలో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంతకం చేయాలి.2.పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి చిరునామాను నిర్ధారించుకోవాలి. 3.పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.4.మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ట్యాబ్లెట్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, నోట్స్, బ్యాగులు, పర్సులు, నగలు తదితర వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు. పరీక్ష కేంద్రాల్లో వస్తువులను భద్రపరిచే సదుపాయం ఉండదు.5.అభ్యర్థులు నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ మాత్రమే పరీక్ష హాలులోకి తీసుకెళ్లాలి. పెన్సిళ్లు, జెల్ పెన్నులు, ఇతర రంగుల పెన్నులు ఉపయోగించరాదు.6.పరీక్ష సమయంలో అభ్యర్థుల ఫోటో, వేలిముద్రలు, సంతకాలను సేకరించడంతో పాటు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ నిర్వహిస్తారు. కాబట్టి వేళ్లపై మెహందీ, తాత్కాలిక టాటూలు లేదా బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగించే పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
7.ప్రశ్నపత్రం అందుకున్న వెంటనే అందులో మొత్తం 200 ప్రశ్నలు, అన్ని పేజీలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఏవైనా లోపాలు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.8 ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించబడుతుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి సమాధానాలను గుర్తించేటప్పుడు జాగ్రత్త వహించాలి.9హాల్ టికెట్‌పై పొందుపరిచిన అన్ని సూచనలు, నిబంధనలను అభ్యర్థులు ముందుగానే పూర్తిగా చదివి తప్పనిసరిగా పాటించాలి.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, అభ్యర్థులు పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు.సంగారెడ్డి జిల్లాలో పరీక్షా కేంద్రాలవివరాలు:
క్ర.సం. పరీక్షా కేంద్రం
1 జేఎన్‌టీయూ, సుల్తాన్‌పూర్, 
2 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట
3 ఎంఎన్‌ఆర్ డెంటల్ కళాశాల, ఫసల్‌వాడి
4 ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫసల్‌వాడి
5 ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్
6 ఎంఎన్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల, ఫసల్‌వాడి
7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సంగారెడ్డి
8 కోత్వాల్ హైస్కూల్, కంది
9 శ్రీ అక్షయ జూనియర్ కళాశాల, మల్కాపూర్
10 ఎస్‌వీ జూనియర్ కళాశాల, రాజంపేట రోడ్
11 సెయింట్ ఆంథోనీ జూనియర్ కళాశాల, శాంతినగర్
12 సెయింట్ ఆంథోనీ హైస్కూల్, శాంతినగర్
13 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, టీఎన్‌జీఓ భవన్ పక్కన
14 సెయింట్ ఆన్స్ హైస్కూల్, రాజీవ్ పార్క్ లేన్
15 ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అంబేద్కర్ స్టేడియం సమీపంలో
16 రిషి హైస్కూల్, బాలాజీనగర్
17 ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, పాత బస్టాండ్ సమీపంలో
18 జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, పాత బస్టాండ్ సమీపంలో
19 తారా ప్రభుత్వ కళాశాల, ప్రశాంత్‌నగర్
20 శ్రీ సాహితి టాలెంట్ స్కూల్, సాయికృపానగర్
21 మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శాంతినగర్
22 రాయల్ జూనియర్ కళాశాల, శాంతినగర్
23 పయనీర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, చింతల్‌పల్లి
24 సెయింట్ పీటర్స్ హైస్కూల్, పీఆర్‌పల్లి
25 శ్రీ తేజ జూనియర్ కళాశాల, కల్వకుంట రోడ్
26 శ్రీ వాణి హైస్కూల్, మంజీరానగర్
27 కరుణ హైస్కూల్, హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: