Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:38 PM | 3 | Politics, తెలంగాణ
మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు
మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు

అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

ధర్మపురి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ మాట్లాడారు.ఈ సందర్భంగా చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడటం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని విమర్శించారు. తాను 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశానని, లక్ష్మణ్ కుమార్ చెబితే తాము వినాలా అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని హితవు పలికారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను విమర్శించే ముందు గతంలో ధర్మపురి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై మాజీ మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. తమ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటమి తర్వాత కూడా ప్రజలకు దూరం కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగితే కాంగ్రెస్ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు.
అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నాం: వేముల రాజేష్అనంతరం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి ఏమిటో తెలుసుకోవాలంటే ధర్మపురికి వచ్చి కళ్లారా చూడాలని సూచించారు.గతంలో మూతపడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృత ఆంధ్ర కళాశాలను తిరిగి ప్రారంభించిన ఘనత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసవికాలంలో తాగునీటి సమస్యతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేసిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతి వాడలో బోరు పంపులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు.ధర్మపురి పట్టణంలో సుమారు రూ.22 కోట్ల అమృత్ పథకం నిధులతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంరఫ్ ), ఎల్ఓసీ నిధులు త్వరితగతిన మంజూరు చేయిస్తూ లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, డిగ్రీ కళాశాల తరగతులు సైతం ప్రారంభమయ్యాయని వెల్లడించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించి ధర్మపురికి బస్ డిపో మంజూరుకు హామీ పొందామని తెలిపారు.మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రజల మధ్య ఉండకుండా, ఇప్పుడు రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని విమర్శించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. రానున్న సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు.తమ నాయకుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేర్పిన విధానం అభివృద్ధి పనులతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమని, వ్యక్తిగత విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. అయితే మంత్రిపై వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: