తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2
నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని గోకుల్ నగర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని కళాకారులు సూచించారు. ముఖ్యంగా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.మాటలు, పాటల రూపంలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నరసింహ, బాలయ్య, భూపతి, సంతోష్, పద్మ, ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు....



