Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 08:57 PM | 8 | తెలంగాణ
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి.....

పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ చెల్లించాలి......

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.....మేకల దాసు ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి....
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...

తెలంగాణ రాష్ట్రంలో (ఐ.సి.డి.ఎస్ ) పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎ.ఐ.టి.యు.సి రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ సిబ్బందికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలు చేయడం, ప్రీ-స్కూల్ విద్యను అందించడం, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన వేతనాలు లేకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండటం, అదనపు విధుల భారం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.


1. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలి.
2. అంగన్వాడీ కేంద్రాల సేవలకు ఆటంకం కలగకుండా టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్ (బి.ఎల్. ఓ ) విధుల నుంచి మినహాయించాలి.
3. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
4. అంగన్వాడీ సిబ్బందికి పీఎఫ్ (పి ఎఫ్ ), హెల్త్ కార్డులు, రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.
5. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలి.
6. అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థకు నష్టం కలగకుండా ప్రీ-ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి.
7. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
8. ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
9. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న( టి ఎ -- డి ఎ) బకాయిలను చెల్లించాలి.
10. పదవీ విరమణ చేసిన అంగన్వాడీ సిబ్బందికి రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి.
11. 2023 సమ్మె కాలానికి సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేయాలి.
12. అర్హత, సర్వీసు ఆధారంగా గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి.

అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేకల దాసు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి సమస్యల పరిష్కారం కోసం ఎ.ఐ.టి.యు.సి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో 
అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు భూపతి రమాదేవి,తోకల సరస్వతి,
ఎ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షులు ఎం డి అక్బర్ అలీ,వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్,కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, పి సురేఖ, నేరేళ్ళ అరుణ,
కే.తిరుమల,ఇంద్ర,శంకరమ్మ, కుసుమ కుమారి,పద్మారెడ్డి,ఎ అరుణ, సరోజ,బి శైలజ,కనకలక్ష్మీ,శారద,సంధ్య, జాడి కృప లు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: