Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలి

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 06:55 AM | 4 | Politics, తెలంగాణ
ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలి
ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలి 
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 3:

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని బాల్కొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో బాల్కొండ, ముప్కాల్ మండలాలకు చెందిన ప్రాథమిక పాఠశాలలప్రధానోపాధ్యాయులఉపాధ్యాయులతో కాంప్లెక్స్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో విద్యార్థులకు మిడ్‌లైన్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో ఏ విధంగా నిర్వహించాలి, డెమో యాప్‌ను ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా మిడ్‌లైన్ పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలి అనే అంశంపై ఉపాధ్యాయులతో ప్రాక్టికల్‌గా మార్కుల ఎంట్రీ చేయించి అవగాహన కల్పించారు.
అలాగే పరక్ , దీక్ష కార్యక్రమాల అమలు, ఆంగ్ల భాషా నైపుణ్యాల అభివృద్ధి, ఇంగ్లీష్ స్పీకింగ్ వంటి ముఖ్యమైన అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు సాయులు, రామకృష్ణ, నటరాజ్, రాజకుమార్ ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై మార్గదర్శనం చేసి, ఆచరణాత్మక శిక్షణ అందించారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని, ప్రతి విద్యార్థి విద్యా పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: