Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాదారం క్రైస్తవ స్మృతి వనాన్ని సందర్శించిన వేలాది మంది క్రైస్తవులు

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 07:02 AM | 70 | Politics, తెలంగాణ
మాదారం క్రైస్తవ స్మృతి వనాన్ని సందర్శించిన వేలాది మంది క్రైస్తవులు
మాదారం క్రైస్తవ స్మృతి వనాన్ని సందర్శించిన వేలాది మంది క్రైస్తవులు

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి నవంబర్ 3: ఆల్ సోల్స్ డే సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం మాదారంలో ప్రభుత్వ క్రైస్తవ స్మృతి వనాన్ని వేలాది మంది క్రైస్తవులు సందర్శించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకుల రాకపోకలు కొనసాగాయి. తమ ఆత్మీయుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుష్పాలతో నివాళులర్పించారు. స్మృతి వనంలో చేపట్టిన రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్ మండల పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ (జి.ఎం.పి.ఎల్.ఏ) మేడిపల్లి, పీర్జాదిగూడ పాస్టర్ల కమిటీలు, పాస్టర్లు, సంఘ పెద్దలు, స్మృతి వనం కమిటీ, ఘట్‌కేసర్ మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం విజయవంతమైంది. వెయిటింగ్ హాల్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సహకరించిన దాత నంధం గణేష్‌కు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్మృతి వనం మరింత అభివృద్ధి చెందేందుకు క్రైస్తవులంతా ఐక్యంగా సహకరించాలని (జి.ఎం.పి.ఎల్.ఏ) నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో (జి.ఎం.పి.ఎల్.ఏ) అధ్యక్షులు బి. జాన్ మార్క్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. శ్రీ రాజేష్, ఉపాధ్యక్షులు వి. శ్రీనివాస్, కార్యదర్శి ఇ. మార్టిన్, కోశాధికారి పి. సునీల్, పాస్టర్ సామ్సన్, పాస్టర్ సూర్య ప్రకాష్, యెర్ర రాజు, రవి, ఇ. ప్రసన్న, పాస్టర్ జి. భాస్కర్, ఎం. ప్రభుదాస్, రోకం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: