తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 4 :
నిజామాబాద్ జిల్లాముప్కాల్ మండలంలోని నల్లూర్ గ్రామంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఈ-సర్వే (అనుభవ సర్వే) ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్షించారు. సర్వే సమయంలో రైతులు, భూయజమానులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. సర్వే పనులు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



