Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాణసంచా బాధిత చిన్నారులకు ‘వాసన్’ అభయం.

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 06:50 AM | 3 | Politics, తెలంగాణ
బాణసంచా బాధిత చిన్నారులకు ‘వాసన్’ అభయం.
బాణసంచా బాధిత చిన్నారులకు ‘వాసన్’ అభయం.

15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నేత్ర వైద్యం.. అవసరమైతే శస్త్రచికిత్సలు సైతం ఉచితం.

 నవంబర్ 5 ( తెలంగాణ కెరటం ):

దీపావళి వేళ బాణసంచా కాల్చుతూ ప్రమాదవశాత్తూ కంటి గాయాల బారినపడే చిన్నారులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నేత్ర వైద్య సంస్థ వాసన్ ఐ కేర్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘సేఫ్ ఐస్.. సేఫ్ దీపావళి’ కార్యక్రమాన్ని చేపట్టి, 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించింది.
ఏఎస్ రావు నగర్‌లోని వాసన్ ఐ కేర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన సమావేశంలో డాక్టర్ సుధీర్ చీమకుర్తి, డాక్టర్ సౌమ్య ఐఆర్, బ్రాంచ్ మేనేజర్ ఫాతిమా అంజుమ్ మాట్లాడుతూ.. నవంబర్ 4 నుంచి 14వ తేదీ వరకు వాసన్ ఐ కేర్, ఏఎస్‌జీ ఐ హాస్పిటల్ కేంద్రాల్లో ఈ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. బాణసంచా కారణంగా కంటికి గాయాలైన చిన్నారులకు అత్యవసర వైద్యం, ప్రథమ చికిత్స, ఉచిత మందులతో పాటు అవసరమైన సందర్భాల్లో శస్త్రచికిత్సలను సైతం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. బాధితులకు అత్యవసర వైద్య మార్గదర్శకత్వం, సమీప ఆసుపత్రుల వివరాల కోసం 1800 5713 333 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. గత ఏడాది దీపావళి సందర్భంగా 500 మందికి పైగా చిన్నారులకు ఈ తరహా సేవలు అందించినట్లు గుర్తుచేశారు.
భద్రతా జాగ్రత్తలు తప్పనిసరి
దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చేటప్పుడు తగినంత సురక్షిత దూరం పాటించాలని, రక్షణ కళ్లద్దాలు ధరించాలని, పేలని టపాసుల వద్దకు వెళ్లకూడదని వైద్యులు సూచించారు. ప్రమాదవశాత్తూ కంటికి గాయమైతే కంటిని ఏమాత్రం రుద్దకుండా, స్వయంగా ఎలాంటి చికిత్సలు చేయకుండా వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. చిన్నారుల కంటి భద్రతకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: