Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనంతసాగర్‌లో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 06:52 AM | 3 | Politics, తెలంగాణ
అనంతసాగర్‌లో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
అనంతసాగర్‌లో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 5, నవంబర్ 
సంగారెడ్డి జిల్లా అనంతసాగర్ గ్రామంలో కుమార్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుమార్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక పరిస్థితులపై నాయకులు పరస్పరం చర్చించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: