Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్ నినో నేపథ్యంలో ఎండిపోయిన పంటల నమోదు.

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 07:34 AM | 4 | తెలంగాణ
ఎల్ నినో నేపథ్యంలో ఎండిపోయిన పంటల నమోదు.
 వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్05,తెలంగాణ కెరటం :
దుబ్బాక మండలం గంభీర్ పూర్, పోతారం గ్రామాలలో ఎల్ నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు మండలం లో ఎండిపోయిన పంటల నమోదు ను మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. వరి కంది మొదలగు పంటలు భూగర్భ జలాలు తగ్గి, కొన్ని బోర్లు ఎండిపోవటం, విద్యుత్ సరఫరా లో ఇబ్బందులతో కొన్ని గ్రామాలలో వరి పంట ఎండిపోవటం గమనించటం జరిగింది అన్నారు.వాటిని జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు అందరు ఏఈఓ లు పంట పొలాలు సందర్శించి సంబందించిన ఆప్ లో రైతుల వివరాలు నమోదు చేయటం జరుగుతుందన్నారు. కావున ప్రజా ప్రతినిధులు, రైతులు గ్రామాలలో ఏఈఓ లను సంప్రదించి ఎండిపోయిన పంటలను నమోదు చేసుకోగలరు అని తెలిపారు. పంటల పర్యవేక్షణలో ఏఈఓ సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు బాణాల శ్రీనివాస్, మల్లేశం,కృష్ణాగౌడ్, వినీత్, కాశి, మల్లవ్వ పలువురు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: