తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచ్ సరికెళ్ళ లతిక నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ధాన్యంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాల విషయంలో రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సూచించారు..రైతుల సంక్షేమమే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ జాన వెంకటేష్, వార్డ్ మెంబర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐకేపీ సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ లతిక నరేష్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ లతిక నరేష్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



