ప్రొసీడింగ్స్ అందజేసిన బిజెపి నాయకులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల.పట్టణంలోని 07,వ వార్డులోని అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎంపీ నిధుల నుండి రూ. 03 లక్షలు మంజూరు అయ్యాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుల కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం అట్టి నిధుల మంజూరు ప్రతిని స్థానిక కౌన్సిలర్ గూగులవత్ శ్రీకాంత్, వార్డు బీజేపీ ఇన్చార్జ్ గుద్దేటి రాజేందర్ ల ద్వారా వార్డు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తిరుమల వాసులు మాట్లాడుతూ...ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎంపీ నిధులను వినియోగించిన ఎంపీగా ముందు వరుసలో నిలిచారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, దేవాలయాలకు, కమ్యూనిటీ హాళ్లకు, కుల సంఘాలకు ఎంపీ నిధుల ద్వారా నిధులు మంజూరు చేసి అందజేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గిన్నెల శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు మైదం సత్యనారాయణ, కార్యదర్శులు చెట్పెల్లి ఓంప్రకాష్, రాధారపు సత్యనారాయణ, బాల్క ప్రేమ్ సాగర్, యువ మోర్చ అధ్యక్షులు ధమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



