తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కల్లూరు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చిట్నేని లత రమేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామంలోని రైతులకు ధాన్యం విక్రయించుకోవడంలో సౌకర్యం కలగనుందని సర్పంచ్ చిట్నేని లత రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జంగ స్వామి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేశ్, వార్డు సభ్యులు తర్రా సునీత రాజేష్, రామగిరి శ్రీధర్, సంకే స్రవంతి, గజం గంగాధర్, గ్రామ రైతులు దొంతుల దేవేందర్, గజం కిషన్, ఇతర కాంగ్రెస్ నాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత, ఐకెపి సెంటర్ సిబ్బంది, గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు.
కల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



