Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి

Author
Posted By TELANGANA KERATAM
| 07 Nov 2026, 07:07 AM | 5 | Politics, తెలంగాణ
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి 

మద్దూరుకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలి

లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మున్సిపల్ కౌన్సిలర్ల హెచ్చరిక

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 6

మద్దూరు: పట్టణంలో రోడ్డు విస్తరణతో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని మద్దూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు, స్థలాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌ శ్రీకాంత్,కు శుక్రవారం, వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అదేవిధంగా మద్దూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మరో వినతిపత్రం అందించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మురుగు కాలువలు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, సీసీ రోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. చెత్త సేకరణ వాహనాలు, జేసీబీ, ఫాగింగ్ యంత్రాలు, రోడ్ల శుభ్రత యంత్రాలు అందుబాటులోకి తేవాలని సూచించారు.యువత కోసం క్రీడా మైదానం, డిజిటల్ గ్రంథాలయం, పార్కులు, వ్యవసాయ మార్కెట్, నూతన మున్సిపల్ భవనం ఏర్పాటు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి కల్పించాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో, కౌన్సిలర్ లో మున్కంపల్లి నరసింహ, కే దినేష్, ఎండి మౌలానా జి గోపాల్, నాయకులు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు...

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: