(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి/ నవంబర్ 6: దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఎస్‌హెచ్‌ఓ తన బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు, బాణసంచా నిల్వలు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. దుకాణదారులు పోలీసు, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీరు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూడాలని, విద్యుత్ వైరింగ్ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పరిసరాల్లో ధూమపానం, బహిరంగ మంటలు వెలిగించడం నిషేధమని, అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయరాదని స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా బాణసంచా విక్రయాలు జరిపితే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యమని పేర్కొంటూ, ప్రజలు కూడా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేసి తగిన జాగ్రత్తలతో పండుగ జరుపుకోవాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు.
బాణసంచా దుకాణాల్లో ఘట్‌కేసర్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
బాణసంచా దుకాణాల్లో ఘట్‌కేసర్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



