Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మందమర్రిలో రోడ్డు ప్రమాదం...మహీంద్రా బొలెరో పికప్ వాహనం ను ఢీకొట్టిన బస్సు, కేసు నమోదు చేసిన పోలీసులు....

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:30 AM | 4 | Crime, తెలంగాణ
మందమర్రిలో రోడ్డు ప్రమాదం...మహీంద్రా బొలెరో పికప్ వాహనం ను ఢీకొట్టిన బస్సు, కేసు నమోదు చేసిన పోలీసులు....
మందమర్రిలో రోడ్డు ప్రమాదం...మహీంద్రా బొలెరో పికప్ వాహనం ను ఢీకొట్టిన బస్సు, కేసు నమోదు చేసిన పోలీసులు....
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల..
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ఒక బస్సు నిలిపి ఉంచిన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ చౌహాన్ అనే డ్రైవర్ తన మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ (నెం. MP 28 ZE 3391) లో టమోటా లోడ్‌తో వస్తుండగా, మందమర్రి సమీపంలో వ్యాన్ వెనుక ఎడమ వైపు టైరు ఊడిపోయింది. దీంతో ఆయన వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ఉంచి, టార్చ్ లైట్ వేసి చూస్తుండగా.. బెల్లంపల్లి నుండి మంచిర్యాల వైపు అతివేగంగా వెళ్తున్న ఒక బస్సు (నెం. MP 41 P 7770) వెనుక నుండి పికప్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పికప్ వ్యాన్ వెనుక భాగం మరియు బాడీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వ్యాన్‌లో ఉన్న టమోటాలన్నీ రోడ్డుపై పడిపోయి భారీ నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ అమిత్ చౌహాన్ పక్కకు ఉండటంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. బస్సు డ్రైవర్ పఠాన్ గఫూర్ ఖాన్ (మహారాష్ట్ర నివాసి) నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు BNS సెక్షన్ 281 కింద క్రైమ్ నంబర్ 266/2026 గా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: