*సభా ప్రాంగణాల పరిశీలన చేసిన సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ
తెలంగాణ కెరటంసిద్దిపేట జిల్లా ప్రతినిధి.
ఈ నెల 19న సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ నేపథ్యంలో, సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవ శ్రీ పూజల హరికృష్ణ పరిశీలించారు.
నాగదేవత గుడి సమీపంలో, పత్తి మార్కెట్ వద్ద, రంగధాంపల్లి చౌరస్తా నుంచి పొన్నాల వెళ్లే మార్గంలోని పలు ప్రదేశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించి, సభ నిర్వహణకు అనువైన ప్రదేశాల ఎంపికపై జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తో చర్చించి సభా వేదికను ఖరారు చేయనున్నట్లు పూజల హరికృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కాలీముద్దీన్ అహ్మద్, దాస అంజన్న, మార్క సతీష్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు రషీద్, వాహబ్, ఆత్మ డైరెక్టర్లు చోట అజమాత్, జనార్దన్ రెడ్డి, టౌన్ మైనారిటీ అధ్యక్షులు అతీఫ్, బంక చిరంజీవి, సీత బాలు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.



