Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత

Author
Posted By TELANGANA KERATAM
| 08 Nov 2026, 07:41 AM | 19 | Crime, తెలంగాణ
రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత
రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్టు

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 7: ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. అనోజిగూడ గ్రామ శివారులోని మసాలా కంపెనీ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టి, కారులో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో మహమ్మద్ అమెర్ (28), మహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్ (35)లను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయిని సేకరించి, హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఒడిశాకు చెందిన పూర్ణచంద్ర మహాపాత్ర గంజాయిని సరఫరా చేయగా, ముంబైకి చెందిన యాస్మీన్ చంద్ సయ్యద్‌కు అందజేయాలని నిందితులు ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించారు. కేజీకి రూ.7 వేల చొప్పున కొనుగోలు చేసి, రూ.15 వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. సరఫరాదారు, స్వీకర్త పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి 60 కేజీల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన మారుతి సుజుకి కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అమెర్‌పై గతంలోనూ పలు గంజాయి కేసులు ఉండటంతో పాటు రెండుసార్లు పీడీ చట్టం కింద నిర్బంధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో, డీసీపీ డాక్టర్ బి. అనురాధ తదితర అధికారుల మార్గదర్శకత్వంలో ఎస్‌ఓటీ, పోచారం పోలీసులు ఈ దాడి నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ఈ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: