Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దీపావళి లక్ష్మీ పూజలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 06:37 AM | 3 | Politics, తెలంగాణ
దీపావళి లక్ష్మీ పూజలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు
దీపావళి లక్ష్మీ పూజలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 8, నవంబర్ 
సదాశివపేట: పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురోహితులు మడుపతి మహేష్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ముందుగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, వితంతువులు, గీత కార్మికులు తదితర వర్గాలకు సంబంధించిన చేయూత పెన్షన్లను దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. నవంబర్ నెల నుంచి అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ కానున్నాయని తెలిపారు.
అదేవిధంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని పులిమామిడి రాజు ప్రజలకు పత్రికా ముఖంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో రాగం అనిల్, తాలెల్మ రాము, గుణాకర్, రియాజ్, రాజు, శ్రీనివాస్, సోమశంకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: