Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గాజులరామారంలో అదిరిపోయిన నరకాసుర దహనం 3.0 - బాణాసంచా వెలుగుల్లో దీపావళి సంబురం

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 07:05 AM | 65 | Politics, తెలంగాణ
గాజులరామారంలో అదిరిపోయిన నరకాసుర దహనం 3.0 - బాణాసంచా వెలుగుల్లో దీపావళి సంబురం
గాజులరామారంలో అదిరిపోయిన నరకాసుర దహనం 3.0 - బాణాసంచా వెలుగుల్లో దీపావళి సంబురం


రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)



గాజులరామారం, నవంబర్ 8:దీపావళి పండుగ సందర్భంగా గాజులరామారం ఉషోదయ కాలనీలో నిర్వహించిన నరకాసుర దహనం 3.0 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాది మంది ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉషాముళ్ళపూడి హాస్పిటల్ ప్రక్కన ఈ వేడుక ప్రారంభమైంది.

క్రాకర్స్ షోతో మెరిసిన ఆకాశం:
ఆంధ్ర నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన క్రాకర్స్ తో నిర్వహించిన బాణాసంచా షో ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగు రంగుల వెలుగులతో ఆకాశం మెరిసిపోగా, ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన నరకాసుర దహనంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలేసింది.

జబర్దస్త్ టీం కామెడీకి కడుపుబ్బా నవ్వులు:
సినీ డబ్బింగ్ ఆర్టిస్టులు & జబర్దస్త్ టీం ప్రోగ్రామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జబర్దస్త్ ఫేమ్ *గడ్డం నవీన్, అప్పారావు, వినోద్* లు చేసిన కామెడీ స్కిట్ లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. చివరి వరకు ప్రేక్షకులను కదలకుండా చేసిన ఈ ప్రోగ్రామ్ వేడుకకు మరింత వన్నె తెచ్చింది.

*ఘనంగా నిర్వహణ:*
ఈ వేడుకకు *రాజు ఎంటర్టైనర్స్ - డేవిడ్ రాజు మునుకోటి* ఆర్గనైజర్ సెక్రటరీగా వ్యవహరించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ *దేగల సతీష్ బాబు*, జనరల్ సెక్రటరీ *వి. నరసింహా రెడ్డి* లతో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.

ఇలాంటి కార్యక్రమాలు కాలనీ ఐక్యతను, సంస్కృతిని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: