– సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్
తెలంగాణ కెరటం(నల్గొండ టౌన్): శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అమరవీరులను స్మరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపంపై ఎర్రజెండాను ఆవిష్కరించి, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(యం-యల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ చిత్తలూరు గ్రామం తెలంగాణ, విప్లవ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో గిరిగాని లక్ష్మి నర్సు (గుండయ్య), సుంకరి సాయన్న, నంద్యాల మల్లయ్యలు నిజాం నిరంకుశ పాలనకు, దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీల దోపిడీ, పీడన, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. అదేవిధంగా కామ్రేడ్స్ సిలువేరు అబ్రహం, ఎల్లంల రాములు, సత్తనపల్లి కనకయ్యలు విప్లవ యోధులు సీపీ రెడ్డి, పొట్ల రామనర్సయ్య, యానాల మల్లారెడ్డి, పలస భిక్షం, బూరుగు అంజయ్య, తోట సోమయ్యల పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు.జీతగాండ్ల సమ్మెలు, సారా వ్యతిరేక పోరాటాలు, కూలీ రేట్ల పెంపు ఉద్యమాలు, భూ పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. మార్క్సిజం-లెనినిజం, మావో ఆలోచనా విధాన స్ఫూర్తితో విప్లవ ఉద్యమాలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.
అమరవీరులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పీడిత ప్రజల విముక్తి కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని, వారు సాగించిన ప్రజా పోరాటాల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద



